Saturday, 30 November 2019

ఏమైపోయావు


నన్ను నేను  అసహ్యించుకున్న
నన్ను నేను ఓదార్చుకున్న

ఓ  క్షణం భుజం తట్టుకున్న
మరో క్షణం వెనక్కి తోసుకున్న

ఓ క్షణం తిట్టుకున్న
మరో క్షణం మెచ్చుకున్న

ఓ క్షణం నడుము బిగించా
మరో క్షణం నడుము వాల్చా

ఓ క్షణం ఆశతో పొంగిపోయా
మరో క్షణం నిరాశతో కృంగిపోయా

ఓ క్షణం గమ్యం చూసా
అది మాయమవ్వడమూ చూసా

మరుపు  లేనిదే గమనం లేదు
 అయినా జ్ఞాపకాల  మననం ఆగదు




నిట్టూర్పులతో నిండిన రాత్రులు అడిగాయి
సాధనతో  నిండిన రాత్రులు ఏమైపోయాయ్ అని

భయంతో  నిండిన కలలు అడిగాయి
పసిపాపలా నిదురించిన రోజులు ఏమయ్యాయి అని

ఎప్పుడూ తోడుండే మనోవేదన అడిగింది
మనఃశాంతి నన్ను ఎందుకు వదిలి వెళ్ళింది అని

నా తెలివి మౌనం పాటించింది
ముక్కలైన నా మనసుని చూసి

గమనం సాగని జీవితం అడిగింది
గమ్యాలు ఏమయ్యాయి అని

అద్దంలో ప్రతిబింబం అడిగింది
ఏమైపోయావ్ నువ్వు అని


No comments:

Post a Comment