Saturday, 4 August 2018

నా ఉనికి

గెలుపే లేని సమరం
అలుపెరగని రుధిరం
ఓటమి కానరాని పయనం
చేసేదెలా, ఆపేదెలా

గేలుపూ లేదు, ఓటమీ లేదు
ఎందుకనీ ఈ యుద్ధం
అలుపు లేదు .. కునుకు లేదు..
ఎందుకనీ ఈ యదార్ధం

అలసిన కనులు.. అప్రమత్తం చేయగా..
బెదిరిన చేతులు.. కత్తి దూయగా..
పదాలు ముందడుగు వేయగా..
గుండెల్లో ఆక్రోశం వెల్లువేతేనే..

ఇందుకోసం.. ఎవరి కోసం..
ఈ గెలుపెరగని సమరం..
అంతులేని యుద్ధం..

చుట్టూ ప్రపంచం..
మరుకోమారు.. మారగా..
ఏది నిజమందుకు..? ఏది భ్రమ అందువు..?
ఈ నిర్విరామ సంఘర్షణ లో.. ఎన్నని గుర్తుంచుకుంటావు?

ఎన్నని గుర్తుంచుకోను..
లోకాలు మారిన.. కాలాలు మారిన..
పొంచి ఉన్న ప్రమాదం మీద పడక తప్పదు..
ఎదురించి పోరాడక తప్పదు..

నేను.. నా ప్రమాదం...
ఇదే నా ఉనికి..
నా ఉనికే నా ఆలోచన.. నా కర్తవ్యం..

లోకము నెంచక..
చుట్టూ చూడక..
అలుపెరగని కనులతో..
గురి తప్పని కారములతో..
నా ఉనికి కొరకై... నా కొరకై..
నా ఈ యుద్ధం.. ఓటమి ఎరుగని యుద్ధం..

P.S: Something I wrote when I was in a different plane of consciousness!!
P.P.S: Used third party tool for generating transcript in Telugu. If you see any mistake, just accept that my Telugu is AWESOME.

No comments:

Post a Comment